పార్కిన్సన్స్ నిర్ధరణకు ఎలాంటి పరీక్షలు, జీవ సూచికలు లేవు. అనుభవం గల డాక్టర్లయితే చూడగానే గుర్తిస్తారు. ఆరోగ్య పరిస్థితి, లక్షణాలు, శరీర భాగాల పనితీరు వంటివి దీన్ని గుర్తించటానికి తోడ్పడతాయి. అవసరమైతే మెదడులో డొపమైన్ పనితీరును గుర్తించటానికి డ్యాట్, పెట్ స్కాన్ పరీక్షలు చేస్తారు. పక్షవాతం మూలంగా రక్తనాళాలు దెబ్బతిన్నాయేమో తెలుసుకోవటానికి ఎంఆస్ఐ చేస్తారు.