పార్కిన్సన్స్ జబ్బు ఎవరికైనా రావొచ్చు. ఇది ఆడవారిలో కన్నా మగవారిలో ఎక్కువ. ఎందుకొస్తుందనేది కచ్చితంగా తెలియదు. చాలామంది 60 ఏళ్లు దాటిన తర్వాతే దీని బారినపడుతుంటారు. అయితే సుమారు 5-10% మందిలో 50ల్లోపే మొదలవుతుంటుంది. దీనికి జన్యుపరమైన అంశాలూ దోహదం చేస్తుంటాయి. చిన్న వయసులో వచ్చినా. అప్పటికే కుటుంబంలో ఎవరైనా పార్కిన్సన్స్‌తో బాధపడుతున్నా జన్యుపరమైన అంశాలు కారణమై ఉండొచ్చని భావించొచ్చు.