* పురుగుమందుల ప్రభావానికి గురికాకుండా చూసుకోవటం మంచిది. ఒకవేళ వీటిని చల్లటం తప్పనిసరైతే రక్షణ దుస్తులు ధరించాలి.
* పిండి వంటల వంటివి చేసినప్పుడు మిగిలిన నూనెను తిరిగి వాడకూడదు. ఇలాంటి నూనెలో ఆల్డీహైడ్లనే విషతుల్యాలుంటాయి.
* ద్విచక్ర వాహనాలు నడుపుతున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్, కారులోనైతే సీటు బెల్టు పెట్టుకోవాలి.
* రోజుకు 4-5 సార్లు రంగురంగుల పండ్లు, కూరగాయలు తినాలి. వీటితో యాంటీఆక్సిడెంట్లు దండిగా లభిస్తాయి.