ఒకసారి పార్కిన్సన్స్ మొదలైతే ముదురుతూ వస్తుందే తప్ప తగ్గదు. దీనికి జీవితాంతం మందులు వాడుకోవాల్సి ఉంటుంది. ఇవి వణుకు నియంత్రణలో ఉండటానికి తోడ్పడతాయి. కుంగుబాటు, నిద్రలేమి, మలబద్దకం వంటి సమస్యలు ఇతరత్రా మందులూ వాడుకోవాల్సి ఉంటుంది. మరీ తీవ్రమైన జబ్బుకైతే మెదడులో స్టిమ్యులేటర్ కూడా అమరుస్తారు. మందులు, వ్యాయామంతో అదుపులో ఉంచుకోకపోతే పదేళ్లలో వైకల్యం బారినపడొచ్చు.