పింఛన్లపై స్పీకర్ కీలక వ్యాఖ్యలు

61చూసినవారు
పింఛన్లపై స్పీకర్ కీలక వ్యాఖ్యలు
AP: పింఛన్లపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘స్పీకర్ల సదస్సులో పాల్గొనేందుకు ఇటీవల పట్నా వెళ్లా. అక్కడ వృద్ధులకు రూ.400 చొప్పున పింఛన్ ఇస్తున్నారు. మన రాష్ట్రంలో వృద్ధులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేల చొప్పున అందజేస్తున్నాం. ఎంత తేడా ఉందో చూడండి. పేదల కోసం సీఎం చంద్రబాబు అమలు చేస్తున్న ఈ పథకాలపై అందరూ ఆలోచించాలి. ప్రభుత్వానికి చేయూత అందించాలి.’ అని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.