ప్రపంచ స్థాయి దిగ్గజ ఆటో మేకర్ తమ వినియోగదార్లకు సడెన్ షాకిచ్చింది. ఏకంగా 80 వేల కార్లను రీకాల్ చేసింది. ముందు ప్రయాణికుల సీటు కింద నేల వైరింగ్ దెబ్బతింటుందని గుర్తించింది. ఈ కారణంగా ఎయిర్ బ్యాగ్‌లు, సీట్ బెల్టులు సరిగా పని చేయకుండా మారుతున్నట్లు తెలిపింది. దీంతో కార్లను వెనక్కి రప్పించి సమస్యను పరిష్కరిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే ఈ రీకాల్ అనేది అమెరికాలో ఉంటుంది. కియా అమెరికా ఈ మేరకు ప్రకటన చేసింది.