ఓలా, ఉబర్‌కు డిమాండ్ పెరగడంతో ఇదే అదనుగా అవి ఫోన్ రకాన్ని బట్టి, ఛార్జింగ్ పర్సంటేజ్‌ను బట్టి ఛార్జీలు వసూలు చేస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ వీటికి నోటీసులు కూడా పంపింది. అయితే అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు అనిపిస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక చాలా మంది తికమక పడుతుంటారు. అటువంటప్పుడు +918800001915 కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని అధికారులు సూచిస్తున్నారు.