కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డుపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ తాజాగా స్పందించారు. కులం, మతంతో సంబంధం లేకుండా ఉద్యమాలు చేశానని ఆయన అన్నారు. తన లాంటి ఉద్యమకారుడిని గుర్తించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. తన ఉద్యమాలకు ఆకలి బాధలు,పేదరికం, పూరి గుడిసెలే స్ఫూర్తి అని తెలిపారు. రాజకీయ పదవులపై ఆశ లేదని స్పష్టం చేశారు.