AP: విజయవాడలో గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ప్రభుత్వ శాఖల శకటాలను ప్రదర్శించారు. మత్స్య శాఖ, ఇంధన శాఖ, ఉద్యానశాఖ, స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ శకటాల ప్రదర్శనను గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ పాల్గొని తిలకించారు.