ప్రత్యేక ఆకర్షణగా ఏటికొప్పాక బొమ్మల శకటం

71చూసినవారు
ప్రత్యేక ఆకర్షణగా ఏటికొప్పాక బొమ్మల శకటం
ఢిల్లీల్లోని కర్తవ్యపథ్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రదర్శించిన వివిధ రాష్ట్రాల శకటాలలో ఏపీ నుంచి ప్రదర్శించిన ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మామూలు కర్రతో తయారు చేసే ఈ బొమ్మలు దేశవిదేశాల్లో ఏపీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇటీవల ప్రధాని మోదీ సైతం ‘మన్ కీ బాత్‌’ కార్యక్రమంలో ఈ బొమ్మల గురించి ప్రస్తావించడంతో వీటికి మరింత గుర్తింపు దక్కింది.

సంబంధిత పోస్ట్