మరోసారి కీలక వడ్డీరేట్లను తగ్గించిన ఆర్‌బీఐ

79చూసినవారు
మరోసారి కీలక వడ్డీరేట్లను తగ్గించిన ఆర్‌బీఐ
కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఆర్‌బీఐ మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది. వరుసగా రెండోసారి రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించింది. ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా బుధవారం వెల్లడించారు. దీంతో రెపో రేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి దిగొచ్చింది. దీంతో హోమ్, పర్సనల్, వెహికల్ లోన్లు తీసుకున్న వారికి ఊరట లభించనుంది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ కీలక వడ్డీరేట్లను 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్