ఆదర్శంగా చిన్నారుల గణేష్ నిమజ్జనం

72చూసినవారు
చిలకలమర్రి జడ్పీ హైస్కూల్ విద్యార్థులు బుధవారం గణేష్ నిమజ్జనాన్ని ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదర్శంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు మట్టితో తయారుచేసిన వినాయక ప్రతిమలను పూజల అనంతరం పాఠశాలలోనే నీటి డ్రమ్ములో నిమజ్జనం చేశారు. గణపతి బొప్పా మోరియా అంటూ ఆనందంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయులు మహేష్, వెంకటేశ్వర్లు, మదీనా కృష్ణారెడ్డి, మాధవి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్