ఇటీవల కాలంలో గుడ్లూరు మండల పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న చాలా ట్రాక్టర్లను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. తాజాగా లింగసముద్రం మండలం లోని ఉప్పుటేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం రావడంతో ఎస్ఐ వెంకటరావు సిబ్బందితో కలిసి వెళ్లి నరసాపురం వద్ద ఐదు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు. ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలించామని నిందితులపై కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు.