అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత

50చూసినవారు
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
గుడ్లూరు మండలం జానకంపేట గ్రామ శివారులో గల ఉప్పుటేరు వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టరును పట్టుకున్నట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు. ఉప్పుటేరు వాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం రావడంతో.. ఎస్సై వెంకట్రావు తన సిబ్బందితో కలిసి బుధవారం దాడి చేసి పట్టుకున్నారు. ఇసుక ట్రాక్టర్ ను పోలీస్ స్టేషన్ కి తరలించి డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్