కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త నీహారిక కందుకూరులోని కేంద్రీయ విద్యాలయం మరియు ఉన్నత పాఠశాల విద్యార్థులకు సమతుల్య ఆహారం, తాజా పండ్లు మరియు కూరగాయలు తినడం వాటి పోషక విలువలు గురించి శుక్రవారం అవగాహన కల్పించారు. పాఠశాల పరిసరాల్లో ప్రతిరోజూ క్రమం తప్పకుండా పండ్లు మరియు కూరగాయలు తప్పనిసరిగా తినడం కోసం పౌష్టికాహార పెరటి తోటల పెంపకం మీద గత ఐదు రోజులుగా ప్రధమ శ్రేణి ప్రదర్శనలు ఇచ్చారు.