రాళ్లపాడు ప్రాజెక్టును సందర్శించిన సబ్ కలెక్టర్ తిరుమణి

73చూసినవారు
రాళ్లపాడు ప్రాజెక్టును సందర్శించిన సబ్ కలెక్టర్ తిరుమణి
లింగసముద్రం మండలం రాళ్లపాడు ప్రాజెక్టును సబ్ కలెక్టర్ తిరుమని శ్రీ పూజ గురువారం సందర్శించారు. అనంతరం అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రాజెక్టు అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 21 అడుగులని ప్రస్తుతం 6. 9 అడుగులకు నీటిమట్టం చేరిందని అధికారులు ఆమెకు తెలిపారు. నిరంతరం ప్రాజెక్టు నీటి మట్టాన్ని పర్యవేక్షిస్తూ ఉండాలని ఆమె తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్