అనుమానాస్పద రీతిలో ఓ యువకుడు మృతిచెందిన ఘటన కావలి పట్టణంలోని 12వ వార్డు అంబేడ్కర్ నగర్లో వెలుగు చూసింది. ఈ ప్రాంతానికి చెందిన సూరిపోగు నాగరాజు (32) అనుమానాస్పదంగా చనిపోయాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు అందగా ఘటనా స్థలానికి వెళ్లారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ప్రభుత్వ ఆసుపత్రికి
తరలించారు.