కావలి: మైనార్టీ మంత్రి ఫరూక్ ను కలిసిన కావలి ఎమ్మెల్యే

66చూసినవారు
నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొనడానికి రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి, నెల్లూరు జిల్లా ఇన్చార్జి మంత్రి యన్. ఎండి ఫరూక్ ఆదివారం నెల్లూరు వచ్చారు. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి మంత్రి ఫరూక్ ను కలిసి సాలువ కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం సమావేశంలో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్