అర్హులైన ప్రతి ఒక్కరికీ నివాస స్థలం ఇస్తామని, ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి తెలిపారు. సోమవారం కావలి అభివృద్ధిపై ఎమ్మెల్యే మున్సిపల్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో నివాసం వుంటూ ఓటు హక్కు కలిగి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు నివాసం కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు.