ఆత్మకూరు: మంత్రి ఫరూక్ కు స్వాగతం పలికిన మంత్రి ఆనం

59చూసినవారు
ఆత్మకూరు: మంత్రి ఫరూక్ కు స్వాగతం పలికిన మంత్రి ఆనం
నెల్లూరు జిల్లా ఇన్చార్జి మంత్రి ఎన్ఎండి ఫరూక్ నెల్లూరు వచ్చారు. ఇన్చార్జి మంత్రి హోదాలో నెల్లూరు జిల్లా సమీక్షా మండలి సమావేశంలో పాల్గొనేందుకు నెల్లూరు ఆర్ అండ్ బి అతిథి గృహానికి రాష్ట్ర మైనారిటీ, న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆదివారం వచ్చారు. ఆయనకు దేవదాయ శాఖ మంత్రి, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి స్వాగతం పలికారు. జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి విషయాలపై మంత్రులు చర్చించుకున్నారు.

సంబంధిత పోస్ట్