విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం గూడూరు రెవిన్యూ ఆఫీస్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు రూ. 3840 కోట్లు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫీజులు కట్టకపోతే కాలేజీలకు రావద్దంటూ విద్యార్థులను ప్రైవేట్ కాలేజీలు ఇబ్బంది పెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.