నెల్లూరు రూరల్ పరిధిలో 37వ డివిజన్లో రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రూరల్ టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. జగన్ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయిందని, కానీ చంద్రబాబు హామీలను నెరవేర్చుతున్నారని అన్నారు.