కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన కొండల రావు కుమార్తె తారక లక్ష్మి భవాని చదువు నిమిత్తం 35, 000 రూపాయల ఆర్ధిక సహాయం అందించి నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శనివారం తన దాతృత్వం చాటుకున్నారు. ఎందరో నిరుపేద విద్యార్థులకు బాసటగా నిలుస్తున్న వీపీఆర్ స్కూల్ లో తారక లక్ష్మి 6 వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు విద్యనభ్యసించింది.