నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేట ఆర్ఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో టపాసుల వ్యాపారస్తులకు అనుమతులు ఇవ్వడం పై ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వెన్ను నరేంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. 400 మంది విద్యార్థులు చదువుతున్న పాఠశాల ఆవరణంలో ఫైర్ కు సంబంధించి ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఎలా అనుమతులు ఇస్తారంటూ ప్రశ్నించారు. ఒకపక్క పాఠశాల వర్కింగ్ డేస్ లో గ్రౌండ్స్ లో టపాసుల అంగళ్లు ఎలా పెడతారు అని ప్రశ్నించారు. విద్యార్థులకు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.