మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు నగరంలోని వారి నివాసంలో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డితో పలు విషయాలను చంద్రశేఖర్ రెడ్డి చర్చించారు. అతి త్వరలోనే కాకాని నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశాలు ఉండడంతో ఈ భేటీ ప్రాముఖ్యత సంతరించుకుంది.