సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. రూ.50 వేలు చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ శనివారం నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. కోర్టులో బెయిల్ పూచీకత్తు సమర్పించనున్నారు. నాంపల్లి కోర్టు జడ్జి ముందు పత్రాలు అందించనున్నారు.