నెల్లూరు రూరల్ పరిధిలోని పెనుబర్తి గ్రామంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమం లో టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి, రెవెన్యూ శాఖలో ఆన్ లైన్ ట్యాంపరింగ్, రికార్డుల తారుమారుపై అధికారులు గ్రామస్థాయిలో ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మార్వో లాజరస్ పాల్గొన్నారు.