నెల్లూరు రూరల్ పరిధిలోని 31వ డివిజన్ విజయలక్ష్మి నగర్ లో గురువారం కోటి రూపాయల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులను నాణ్యత ప్రమాణాలతో, వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు, కార్యక్రమంలో రూరల్ టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ బత్తల మంజుల పాల్గొన్నారు.