రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పై మద్యం షాపులకు సంబంధించి వస్తున్న ఆరోపణలు అవాస్తమని నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఆయన మాట్లాడుతూ టెండర్లలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నగరంలో సిండికేట్లను తయారుచేసి తన అనుచరులకు తన కార్యకర్తలకు ఇస్తున్నారని చెప్పటం నిజం కాదన్నారు.