సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాల్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఆయా గ్రామాల్లో టిడిపి నాయకులు ప్రతి ఇంటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేస్తూ 100 రోజుల్లో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి గురించి వివరించారు. అలాగే రాబోయే రోజుల్లో ప్రవేశపెట్టనున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. కాగా ఈ కార్యక్రమం 26వ తేదీ వరకు జరగనుంది.