నెల్లూరులో మంగళవారం జరిగిన రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో అనంతపురం బాలికల జట్టు పోరాడి ఓటమి పాలైంది. ఫైనల్లో కడప, అనంతపురం జట్లు హోరాహోరీగా తలపడగా మ్యాచ్ డ్రా అయింది. తదుపరి పెనాల్టీ కార్నర్లో 2-1 తేడాతో అనంత బాలికల టీమ్ రన్నర్ గా నిలిచింది. మేనేజర్స్ నాగరాజు, శ్రీనివాసులు, రాకేశ్, ప్రతాప్, స్కూల్ గేమ్స్ సెక్రటరీ సుగుణమ్మ, మొరార్జీ యాదవ్ అభినందనలు తెలిపారు.