ముదిగుబ్బలో శ్రీ పార్వతి దేవి ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం

65చూసినవారు
ముదిగుబ్బ మండలం కన్యకలగొందిలో గురువారం శ్రీ పార్వతి దేవి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, యాగశాల ఆరాధన, ప్రతిష్ఠాంగహోమం, గర్తపూజ, మహాపూర్ణాహుతి, మహాకుంభ సంప్రోక్షణ, శ్రీ శివపార్వతుల శాంతి కళ్యాణం పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.