ఏపీయూడబ్ల్యూజే సత్యసాయి జిల్లా ధర్మవరం రెవెన్యూ డివిజన్ కమిటీ సభ్యులు ఆదివారం బీజేపీ కార్యాలయంలో మంత్రి సత్య కుమార్ యాదవును కలిశారు. జిల్లా అధ్యక్షుడు పుల్లయ్య మాట్లాడుతూ. ధర్మవరంలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఘనంగా మహాసభ ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనిపై మంత్రి సత్య కుమార్ తో చర్చించామని అన్నారు. అనంతరం మంత్రి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.