ధర్మవరం పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన రేణుక అనే బాలిక మంగళవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.