శ్రీసత్యసాయి జిల్లాలోని 3 నియోజకవర్గాల టీడీపీ పార్టీ మండల కన్వీనర్లు, ముఖ్య నాయకులు సోమవారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ కలసి మంత్రి సవిత ను కలిశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో కక్ష సాధింపులతో ఎన్డీఏ సానుభూతిపరులకు సంబంధించిన రేషన్ కార్డులు ఇష్టానుసారం తొలగించారని దాని వలన నేటికీ సంక్షేమ పథకాలు అందకుండా పోతున్నాయన్నారు.