అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య, ఏసీపీ అబ్దుల్ సత్తార్, ప్లానింగ్ సెక్రటరీ లోకేష్ విజయవాడలోని వరద ముప్పు ప్రాంతాలలో సేవలకు కదిలారు. గత రెండు రోజుల నుంచి విజయవాడలోని వరద ప్రాంతాలలో సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అందులో భాగంగా శుక్రవారం సింగన్న నగర్ లోని వరద బాధితులకు నిత్యవసరుకులను పంపిణీ చేశారు.