గుంతకల్లు మండలం రజాపురం గ్రామ సమీపంలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై గత నెలలో కురిసిన భారీ వర్షాలకు రోడ్డు గుంతల మయం కావడంతో వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆదేశాల మేరకు గుత్తి మండల టీడీపీ ఇంఛార్జ్ గుమ్మనూరు నారాయణ రోడ్డుకు ఎర్ర మట్టితో తాత్కాలిక మరమ్మత్తు పనులు గురువారం చేపట్టారు.