ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇంటి పట్టాలు తన వద్ద పెట్టుకొని డబ్బులు డిమాండ్ చేసి బెదిరించిన కేసులో కదిరి మండలం సున్నపుగుట్ట తాండాకు చెందిన సోమ్ల నాయక్ ను అరెస్ట్ చేసినట్లు సిఐ నారాయణరెడ్డి తెలిపారు. సీఐ బుధవారం మీడియాతో మాట్లాడుతూ సోమ్ల నాయక్ వద్ద అక్రమంగా ఉన్న సుమారు 39 ఇంటి పట్టాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.