నల్లచెరువు: విద్యుత్ కోతలతో జనం ఇక్కట్లు

52చూసినవారు
నల్లచెరువు: విద్యుత్ కోతలతో జనం ఇక్కట్లు
మండల కేంద్రంలోని నల్లచెరువులో గల పలు ప్రాంతాలలో ప్రజలు నిత్యం విద్యుత్ కోతలతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకించి బురుజు గంగమ్మ ఆలయం వద్ద ఉన్న డిపి నిత్యం మరమ్మతులకు గురవుతోంది. ఈడిపి నుండి మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలతో పాటు రైల్వే గేట్ అవతలి ప్రాంతంలోని ఇళ్లకు విద్యుత్ సరఫరా అవుతుంది. అయితే విద్యుత్ కోతలు పెరిగిపోతుండడంతో డిపి నుండి విద్యుత్ సరఫరా అయ్యే కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్