కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన జోత్స్న అనే యువతి బోన్ క్యాన్సర్ తో బాధపడుతోంది. ఈ విషయాన్ని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే సురేంద్రబాబుకు తెలియజేశారు. దీంతో ఆయన శనివారం కళ్యాణదుర్గంలోని ప్రజావేదికలో క్యాన్సర్ బాధితురాలి కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అదేవిధంగా అండగా ఉంటానని, అధైర్యపడవద్దని భరోసా కల్పించారు.