శ్రీసత్య సాయి జిల్లా మడకశిర పట్టణంలో సిపిఐ కార్యాలయంలో శుక్రవారం సిపిఐ తాలూకా కార్యదర్శి పవిత్ర విద్యార్థులకు సమయానికి అనుగుణంగా బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. పవిత్ర మాట్లాడుతూ విద్యార్థులకు సమయానికి బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోని సమయానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళన చేపడుతానని తెలిపారు.