పూతలపట్టు పాఠశాల ఉపాధ్యాయుడు సిద్ధయ్యశెట్టి పరీక్షా పేపర్లు తీసుకెళ్లుతూ ప్రమాదానికి గురై మరణించారని డిటీఎఫ్ నాయకులు తెలిపారు.పుట్టపర్తి ఓబుళదేవరచెరువు మండల కేంద్రంలో శుక్రవారం సమావేశమై, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పరీక్షా పేపర్లను ప్రభుత్వమే పాఠశాలకు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.