పుట్టపర్తి: హాస్పిటల్ లో పింఛన్ అందజేసిన ఎమ్మెల్యే, పల్లె

73చూసినవారు
నల్లమాడ మండల కేంద్రానికి చెందిన గోపన్న అనారోగ్య కారణాలతో వారం రోజుల క్రితం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సింధురరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మంగళవారం ఆసుపత్రికి వెళ్లి గోపన్నను పరామర్శించారు. అతడి ఆరోగ్య పరిస్థితి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం ఆసుపత్రిలోనే పెంచెన్ అందించి మనో ధైర్యం చెప్పారు

సంబంధిత పోస్ట్