సోషల్ మీడియా నుంచి మన పిల్లలను మనమే రక్షించుకోవాలని ఐ సి డి ఎస్ పి డి నాగమల్లేశ్వరి దేవి పేర్కొన్నారు. బుధవారం పుట్టపర్తిలోని మండల సమైక్య కార్యాలయంలో బుక్కపట్నం, కొత్తచెరువు, పుట్టపర్తి మండల పరిధిలో పనిచేసే పోలీసులకు, సిఆర్పిలకు, యువతకు ఆన్లైన్ ద్వారా జరిగే అనార్థాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాలల పరిరక్షణ అధికారి మహేష్, కోఆర్డినేటర్ అలెస్కో, ఆనంద్ బాబు, లలిత, తదితరులు పాల్గొన్నారు.