బొమ్మనహల్ మండలంలోని ఉద్దేహాల్ లో ఈ నెల 30వ తేది ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పి జగదీష్, విప్ కాలవ శ్రీనివాసులు ఆ గ్రామంలో పర్యటించారు. సోమవారం సాయంత్రం ఆ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానం, గ్రామంలోని రచ్చకట్టలను పరిశీలించారు. గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన విజయవంతం అయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.