పుట్లూరు మండల పరిధిలోని కడవకల్లు జాతరలో శనివారం దొంగలు రెచ్చిపోయారు. గమనించిన స్థానిక ప్రజలు చోరీలకు పాల్పడుతున్న వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రజలు వారిని చితకబాదే ప్రయత్నం చేయడంతో విషయం తెలుసుకున్న పోలీసులు చోరీకి పాల్పడుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని పుట్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.