యల్లనూరు: బంగారు నగల రికవరీ

58చూసినవారు
యల్లనూరు: బంగారు నగల రికవరీ
యల్లనూరు మండల కేంద్రంలో మూడునెలల క్రితం జరిగిన బంగారు నగల చోరీ కేసులో నిందితుడు కోలాటం శంకర్ ను సోమవారం అరెస్టు చేసినట్లు ఎస్ఐ రాంప్రసాద్ తెలిపారు. గత జూలై 15న మండల కేంద్రంలో కోలాటం పెద్దక్క ఇంటిలో మూడున్నర తులాల బంగారు నగలు చోరీ అయినట్లు కేసు నమోదైంది. నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్