తాడిపత్రి మండలం రావి వెంకటాంపల్లి సమీపంలో గురువారం గుర్తు తెలియని వృద్ధుడు (60) మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్ఐ కాటప్ప తెలిపారు. రోడ్డుపై పడ్డ వ్యక్తిని పరిశీలించగా అప్పటికే మృతి చెండాడన్నారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదన్నారు. శరీరం పై ఉన్న గాయాలను బట్టి ప్రమాదం చోటు చేసుకుని మృతి చెంది ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆచూకీ తెలిసిన తాడిపత్రి రూరల్ పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ కాటప్ప కోరారు.