పెద్దవడుగూరు: ఆ పాఠశాలలో ఒకే టీచర్, ఒకే విద్యార్థి

63చూసినవారు
ఒక్కప్పుడు విద్యార్థులతో కళకళలాడిన పెద్దవడుగూరు మండలం కాశేపల్లి ప్రాథమిక పాఠశాల ప్రస్తుతం వెలవెలబోతోంది. వంద మందికి పైగా ఉన్న ఈపాఠశాలలో రానురాను విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. చివరికి ఒక్కరు మాత్రమే మిగిలారు. గ్రామానికి చెందిన కుళ్లాయమ్మ అనే బాలిక ఒకటో తరగతిలో కొనసాగుతోంది. బాలికకు ఉపాధ్యాయిని నిఖిత పాఠాలు బోధిస్తున్నారు. వంట ఏజెన్సీ వాళ్లు మధ్యాహ్న భోజనాన్ని ఒక్కరికి మాత్రమే వండుతున్నారు.

సంబంధిత పోస్ట్