తాడిపత్రి పట్టణంలో నేడు 20 అడుగుల భారీ శివుని విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేయనున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి క్యాంప్ కార్యాలయం ఆదివారం పేర్కొంది. పట్టణ పరిధిలోని అనంతపురం రోడ్డు రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి సర్కిల్ వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విగ్రహ ఏర్పాటు పనులకు భూమి పూజ చేయడం జరుగుతుందన్నారు. మున్సిపల్ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.